BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్
హైదరాబాద్ : (వర్డ్ ఆఫ్ ఇండియా)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ (అడిషనల్ ఏజీ)గా న్యాయవాది తేరా రజనీకాంత్ రెడ్డి ప్రస్తుత అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సమక్షంలో నిన్న బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తర్వాత రెండో స్థానంలో ఉండే ఈ కీలక పదవిలో ఆయనను నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గత గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. ఇకపై అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా అడ్వకేట్ జనరల్ తో పాటు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన వాదించనున్నారు.
రజనీకాంత్ రెడ్డి ఎన్నో యేళ్ళుగా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, సివిల్ మరియు క్రిమినల్ విభాగాలలో వివిధ కేసులను వాదించి గెలిచారు. రికవరీ ట్రిబ్యునల్‌తో సహా వివిధ దిగువ కోర్టుల్లో దాఖలైన కేసులతో పాటు ఇప్పటివరకు ఆయన కొన్ని వందలకు పైగా కేసులు వాదించారు.
అతను HMDA (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ)లో ఆడిటర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇలా తేరా రజనీకాంత్ రెడ్డి ప్రస్థానం సుదీర్ఘకాలం న్యాయవాద వృత్తిలో అనేక మైలురాల్లను దాటుకొని వచ్చారనే చెప్పాలి. ఇలా రజినీకాంత్ రెడ్డి తన న్యాయవాద వృత్తిలో ఎన్నో పెద్ద కేసులను వాదించి గెలిచారని, తన అనుభవంతో ఎంతో మంది జూనియర్ న్యాయవాదులకు శిక్షణనిస్తూ వివిధ కోర్టులలో పనిచేసే నైపుణ్యాన్నివారికందించటం లో కూడా ఆయన పాత్ర గొప్పదని హైకోర్టు న్యాయవాదులు కొనియాడారు.
ఆయన న్యాయవాద వృత్తిపట్ల ఎంతో అంకిత భావంతో పనిచేస్తారని, వృత్తి నైపుణ్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించారని తన సహచర న్యాయవాద మిత్రులు తెలిపారు. అయితే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం పక్షాన ముందుండి తన నూతన ఒరవడితో, వృత్తి నైపుణ్యతతో తన స్వరం వినిపించాలని ఆకాంక్షిస్తూ అక్కడున్న హైకోర్టు న్యాయవాదులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.