ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టు చట్ట విరుద్ధమంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్(MLC Kavitha Petition)పై ఉన్నత న్యాయస్థానం ఈరోజు స్పందించింది.
రాజ్యంగ చట్టబద్ధత అనే అంశంపై దాఖలైన మరో కేసుతో కలిపి.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణ చేస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడం అక్రమంటూ ఎమ్మెల్సీ కవిత ఇటీవల సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్(MLC Kavitha Petition) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ కోసం ట్రయర్ కోర్టుకు వెళ్లాలని.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కవితకు సూచించింది.
ఈ విచారణలో భాగంగా ఈడీ తీరుపై ఎమ్మెల్సీ కవిత తరుఫు న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వెలిబుచ్చారు. ప్రస్తుత పరిణామాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని ధర్మాసనం దృష్టికి ఆయన తీసుకొచ్చారు.
ఈ క్రమంలో కపిల్ సిబల్ భావోద్వేగానికి గురికావొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనను వారించారు. ఈ కేసులో కవితను ఓసారి నిందితురాలిగా.. మరోసారి సాక్షిగా ఈడీ విచారణకు పిలిచిందని కపిల్ సిబల్ ఆరోపించారు.
ఎలాంటి బలమైన సాక్ష్యం లేకుండా దర్యాప్తు చేస్తున్నారని కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు జరుగుతోందని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.
బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాల్సిందే..
ఎమ్మెల్సీ కవిత కేసులో ప్రస్తుతం తాము మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాము బెయిల్ మంజూరు చేయలేమని.. దానికోసం కింది కోర్టుకు వెళ్లాల్సిందేనని పేర్కొంది.
ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సుప్రీం సూచించింది. ఈ రిట్ పిటిషన్(MLC Kavitha Writ Petition)లో రాజ్యాంగ ఉల్లంఘన అంశం లేవనెత్తినందున.. ఇలాంటి కేసు దాఖలు చేసిన విజయ్ మదన్‌లాల్ కేసుకు జతచేసింది.
అటు రాజ్యాంగపర అంశాలపై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం మరో రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత.. సుప్రీం కోర్టులో బెయిల్ కోసం రిట్ పిటిషన్(MLC Kavitha Petition) దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిందని.. చట్టాల్ని ఉల్లఘించిందని అందులో పేర్కొన్నారు.
ఈడీ నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కవిత పిటిషన్(MLC Kavitha Writ Petition)లో తెలిపారు. తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే ఈడీ అరెస్టు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ నగదు ఆరోపణల అంశంలో ఈడీ ఆధారాలు చూపించలేదని ఎమ్మెల్సీ కవిత పిటిషన్(MLC Kavitha Writ Petition)లో రాసుకొచ్చారు. అరెస్టు ఉత్తర్వుల్లోని కారణాలన్నీ అవాస్తవాలని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ విధానం పేరుతో తనను బీజేపీ పార్టీ రాజకీయ వేధింపులకు గురిచేస్తోందని ఆమె వివరించారు.