Friday, December 20, 2024
HomenewsTSSPDCL విద్యుత్ సంస్థలో అక్రమ నియామకాలు..!?

TSSPDCL విద్యుత్ సంస్థలో అక్రమ నియామకాలు..!?

By

ఐశ్వర్య రాజ్

తెలంగాణ లోని మరో విద్యుత్ సంస్థ లో అక్రమ నియామకం గురించి బయటపడింది. TSSPDCL లో లైన్ మెన్ ఉద్యోగ నియామకల్లో చాలా మంది అక్రమ మార్గం లో ఉద్యోగాలు పొందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు అభ్యర్థులు హైదరాబాద్ లోకల్ కాకపోయినా.. వారు ఫేక్ ఫేక్ సర్టిఫికేట్ లతో అక్రమ మార్గం లో ఉద్యోగాలు పొందినట్లు విమర్శలు వస్తున్నాయి. దీనిపై కొంతమంది ఆధారాలతో డిస్ కామ్ అధికారులతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి.

గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో లైన్ మెన్ ఉద్యోగాలకు మొదటిసారిగా నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున విమర్శలు రావడం తో అప్పటి నోటిఫికేషన్ పరీక్షను రద్దు చేశారు. అనంతరం ఏప్రిల్ నెల లో రెండోసారి రీ నోటిఫికేషన్ ఇచ్చి 1,553 పోస్టులకు పరీక్షను నిర్వహించారు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అక్రమ నియామకాలు ఒక్కొక్కటి గా బయటపడుతున్నాయి. తాజాగా డిస్కం సంస్థ లో మరోక అక్రమ నియామకం బయటకు వచ్చింది. గతంలో అక్రమాలు జరిగాయని ఒక సారి లైన్ మెన్ నోటిఫికేషన్ ను డిస్కం సంస్థ వారు రద్దు చేశారు . మరొకసారి జరిపిన పరీక్షలో కూడా ఫేక్ సర్టిఫికేట్ లతో భారీ ఎత్తున అక్రమాలు. పరీక్షతో పాటు స్కిల్ టెస్టు ను కూడా నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఇందులో పెద్ద ఎత్తున చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టి హైదరాబాద్ లోకల్ పోస్టులను కొల్లగొట్టినట్లు పెద్ద ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ జోన్ పరిధిలోని 263 పోస్టులు కేటాయించగా.. ITI క్వాలిఫికేషన్స్ తో పరీక్ష పాస్ అయిన వాళ్ళు హైదరాబాద్ జోన్ పరిధిలో చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఒక వ్యక్తి ఒకటో తరగతి నుండి 7 వ తరగతి వరకు ఎక్కడైతే నాలుగేళ్ళు చదువుతారో ఆ అభ్యర్ధి అక్కడి లోకల్ అభ్యర్ధి గా పరిగణిస్తారు. కాగా సదరన్ డిస్కం పరిధిలోని హైదరాబాద్ జోన్ లో ఎక్కువ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి.. కానీ లోకల్ అభ్యర్ధులు తక్కువగా ఉన్నారు మరియు వారి మధ్య కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంది. కొన్ని కేటగిరీ లో పోస్టులు కూడా మిగిలిపోయాయి. కాబట్టి ఇటువంటి పరిస్తితి ని ఆసరాగా చేసుకొని కొంతమంది అభ్యర్ధులు లోకల్ కాకపోయినా ఫేక్ సర్టిఫికేట్ లు సంపాదించి హైదరాబాద్ జోన్ లో అక్రమంగా ఉద్యోగాలు పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఎస్టీ కేటగిరీ లో 32 పోస్టులకు   20 మంది కంటే ఎక్కువే నకిలీ సర్టిఫికేట్ లతో ఉద్యోగాల్లో చేరినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కాగా ఇలా అక్రమ మార్గం లో ఉద్యోగాలు పొందిన విషయం గురించి కొంతమంది నిరుద్యోగులు టీఎస్ఎస్పిడీసీఎల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. జయపాల్, ప్రశాంత్ , శ్రీనివాస్, గిరిధర్ రాజు, హరిచరణ్ అనే నిరుద్యోగులు కంప్లయింట్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నుంచి 7 గురు, నల్గొండ నుండి 6 గురు, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుండి ఇద్దరు, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ బాద్ జిల్లాల నుండి ఒక్కో అభ్యర్ధి నకిలీ సర్టిఫికేట్ లు పెట్టి ఉద్యోగాలు పొందారని కంప్లయింట్ చేశారు. కానీ ఇప్పటి వరకు సంభందిత అధికారులు దీని పై దర్యాప్తు చేయలేదు.

ఈ మధ్యనే జెన్కో సంస్థ లో అక్రమ మార్గం లో ఉద్యోగం పొంది డ్యూటి చేయకుండానే లక్షల రూపాయలు వేతనాలు దోచుకున్న విషయం వెలుగు లోకి వచ్చిన మనందరికీ తెలిసిందే. ఇలా విద్యుత్ సంస్థల్లో ఒక్కొక్క అక్రమాలు వెలుగు చూస్తున్న నేపధ్యం లో ప్రభుత్వం దీని గురించి దృష్టి సారించి దర్యాప్తు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS