BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్
తెలంగాణ, హైదరాబాద్. డిసెంబర్ 5
వర్డ్ ఆఫ్ ఇండియా
ఎప్పుడెప్పుడా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు అని ఎదురుచూస్తున్న దానికంటే భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంకాసేపట్లో సీఎం అభ్యర్థి పై ప్రకటన వెలబడుతుంది అంటూనే రెండు రోజులు కావస్తున్నా హై కమాండ్ నుండి ఎలాంటి ప్రకటన వెలువడడం లేదనేది ప్రజల అభిప్రాయం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వేల కేవలం తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండడం, దేశమంతా తెలంగాణ సీఎం ఎవరు? అనే దానిపై ఆసక్తి నెలకొన్నది. ఈ తంతు ఇలాగే కొనసాగితే ప్రజలు మరింత నిరుత్సాహానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయనేది కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా. ఏది ఏమైనప్పటికీ ఒక సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేది ఏ చిన్న ప్రాంతీయ పార్టీనో కాదు కదా అనే భావన కూడా ప్రజల్లో ఉన్నప్పటికీ ఈరోజు సాయంత్రానికల్లా సీఎం అభ్యర్థి ఎవరదానికి పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు తోడు కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం.