మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. గెలిచిన వారికి జగన్ అభినందనలు తెలియజేసారు. గెలవని వారికి నిరుత్సాహపడొద్దని ధైర్యం చెప్పారు. జగన్ తన నివాసంలోని అధికారిక గదిలో ఉండగా, పార్టీ నేతలంతా ఒక్కసారిగా లోపలికి వెళ్లిపోవడంతో వారికి కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు. జగన్‌తో మళ్లీ ఎప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడతామో అని చాలా మంది నేతలు తమకున్న బాధలను తెలియజేసారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టున్న గ్రామాల్లో కూడా ఓట్లు పడలేదంటే ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, దీని గురించి లోతుగా విచారణ చేయించాల్సి ఉందని అన్నారు. దీనికి జగన్ సమాధానమిస్తూ తనకు కూడా అనుమానాలు ఉన్నాయని, కానీ ఆధారాలు లేకపోవడంతో ఇప్పుడు చేయడానికి ఏమీ లేదని చెప్పారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత కచ్చితంగా గెలుస్తామని, అప్పటివరకు ప్రతిపక్ష హోదాలో అధికార పార్టీని ప్రశ్నిద్దామని చెప్పారు. మరో రెండు రోజుల్లో జగన్ పార్టీ నేతలందరి కోసం ఓ ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాట్లు చేయనున్నారు.