Wednesday, September 16, 2026
Homenewsటీ20 ప్రపంచకప్ విక్టరీ పరేడ్‌లో అపశృతి

టీ20 ప్రపంచకప్ విక్టరీ పరేడ్‌లో అపశృతి

టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ముంబైలో నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో అపశృతి చోటుచేసుకుంది. మెరీన్ డ్రైవ్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు జరిగిన ఈ విజయోత్సవ ర్యాలీకి అభిమానులు కుప్పలుతెప్పలుగా వచ్చారు. రద్దీ కారణంగా పలువురికి గాయాలు అయ్యాయి.

 

అభిమానుల ఉత్సాహం పెరిగి, కార్లపై ఎక్కి చిందులు వేశారు. ఈ చర్యల వల్ల అనేక కార్ల టాపులు సొట్టలు పడ్డాయి. రద్దీతో ఉక్కపోత కారణంగా ఒక మహిళ స్పృహ తప్పిపోవడంతో, ఆమెను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. మరొక వ్యక్తి రద్దీ కారణంగా కాలు జారి కిందపడి స్పృహ తప్పాడు. పరేడ్ నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారని, రద్దీ నియంత్రణలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని కొందరు విమర్శించారు. రాత్రి 8 గంటల సమయంలో రద్దీని నియంత్రించేందుకు అక్కడ ఒక్కరూ కనిపించలేదని అనుకున్నారు.

విజయోత్సవ సంబరాల కారణంగా దక్షిణ ముంబైలో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. మెరీన్ డ్రైవ్‌పై వాహన రాకపోకలు ఆపేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో రద్దీ పెరిగింది. వాంఖెడే స్టేడియం కూడా అభిమానులతో నిండిపోయింది. జూన్ 29న జరిగిన ఫైనల్స్‌లో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్ సాధించడం ద్వారా భారత జట్టు రికార్డు సృష్టించింది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS