Tuesday, October 15, 2024
Homeతెలుగుఎడ్యుకేషన్T SAT: గ్రూప్స్ పోటీ పరీక్షల కోసం టి-సాట్ క్రాష్ కోర్స్ ప్రసారాలు

T SAT: గ్రూప్స్ పోటీ పరీక్షల కోసం టి-సాట్ క్రాష్ కోర్స్ ప్రసారాలు

తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ(TSPSC) ఆధ్వర్యంలో భర్తీ చేసే గ్రూప్-1,2,3 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం టీ-సాట్(T SAT) క్రాష్ కోర్సులు తెచ్చింది. టీ-సాట్ నెట్వర్క్ అన్‌లైన్ ఓరియంటేషన్ లైవ్ క్లాసులతో పాటు, క్రాష్ కోర్స్ అందిస్తోందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో క్రాష్ కోర్స్ ఆన్ లైన్ ప్రసారాలకు సంబంధించిన వివరాలను సీఈవో వివరించారు. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం నిపుణ ఛానల్ లో 11 నుంచి 12 గంటల వరకు మొదటి అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. అనుభవం కలిగిన బోధన సిబ్బందితో బయోలజీ సబ్జెక్ట్ గురించి ప్రోగ్రామ్ ప్రసారమౌతుందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

టీ-సాట్(T SAT) విద్య ఛానల్ ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పున: ప్రసారమౌతాయన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించి రేపటితో ప్రారంభమయ్యే లైవ్ క్రాష్ కోర్స్ ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగనున్నాయని సీఈవో స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టులు 563, గ్రూప్-2 పోస్టులు 783, గ్రూప్-3 పోస్టులు 1,388 భర్తీ చేస్తున్న సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీ-సాట్(T SAT) అందించే క్రాష్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఈవో వేణుగోపాల్ రెడ్డి వివరించారు.

క్రాష్ కోర్స్ ప్రసారాలు టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు విద్య, నిపుణతోపాటు యాప్, యూట్యూబ్‌ల్లోనూ ప్రసారమౌతాయని, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఈవో సూచించారు.
అభ్యర్థులు తమ తమ సందేహాలను తీర్చుకుంటూ సమాధానాలు పొందేందుకు 040 23540326,726 టోల్ ఫ్రీ 1800 425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు

READ LATEST TELUGU NEWS:  గ్రూప్-1, 2, 3 పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. సమయం సరిపోతుందా?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS