Saturday, June 21, 2025
HomeIND Vs ENG: సొంతగడ్డపై భారత్ జయభేరీ.. 3-1తో టెస్టు సిరీస్ కైవసం

IND Vs ENG: సొంతగడ్డపై భారత్ జయభేరీ.. 3-1తో టెస్టు సిరీస్ కైవసం

IND Vs ENG: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చరిత్ర సృష్టించింది. 3-1 తేడాతో ఇంకొక టెస్టు మిగిలి ఉండగానే ఇంగ్లీషు జట్టుపై గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టంతో ఛేదించి విజయదుందుభి మోగించింది.

సిరీస్ సాగుతోందిలా..

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియాపై గెలిచి ఇంగ్లండ్ జట్టు 1-0తో ఖాతా తెరిచింది. అయితే ఈ ఓటమితో పాఠాలు నేర్చుకున్న రోహిత్ సేన.. ఆ తర్వాతి టెస్టుల్లో వరసగా గెలిచి ఇంగ్లీష్ ప్లేయర్లకు కంటిమీద కునుకులేకుండా చేసింది. విశాఖ, రాజ్‌కోట్‌లలో జరిగిన 2వ, 3వ టెస్టులతో పాటు తాజాగా రాంచీలో జరిగిన 4వ టెస్టులో గెలుపు జెండా ఎగరేసి సొంతగడ్డపై తామేంటో నిరూపించుకుంటోంది.

రాంచీ టెస్టులో టాస్ ఓడిన భారత జట్టు బౌలింగ్‌కే పరిమితమైంది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ తాకిడికి ఇంగ్లండ్ ఆగమాగమైంది. మొదటి సెషన్‌లోనే ఆకాశ్ దీప్ 5 వికెట్లు పడగొట్టడంతో భారత్ పైచేయి సాధించింది. ఆ తర్వాత సీనియర్ బౌలర్లు జడేజా, అశ్విన్‌ల స్పిన్ మాయాజాలానికి ఇంగ్లీషు బ్యాటర్లు విలవిలలాడిపోయారు. 112 రన్స్‌కే 5 వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ జట్టుకు జో రూట్ తనవంతు బలాన్ని అందించాడు. దీంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 353 రన్స్ వద్ద ఆలౌట్ అయ్యింది.

అనంతరం రంగంలోకి దిగిన టీమిండియా 307 పరుగులు సాధించి ఆలౌట్ అయ్యింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇంగ్లండ్ 145 పరుగులకే చేతులెత్తేసి.. భారత్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల కోల్పోయిన భారత్ 61 ఓవర్లలోనే ఈ పరుగులను ఛేదించి సొంతగడ్డపై విజయభేరి మోగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్‌మన్ గిల్ (52) హాఫ్ సెంచరీలతో మెరిసారు. ధ్రువ్ జురెల్ (39), యశస్వి జైస్వాల్ (37) రాణించారు. దీంతో మరొక టెస్టు మిగిలి ఉండగానే ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకున్నారు. దీంతో 17వ సిరీస్‌ టైటిల్‌ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఇక సిరీస్‌లో నామమాత్రపు మ్యాచ్ అయిన 5వ టెస్టు మార్చి 7వ తేదీన ధర్మశాలలో జరగనుంది.

రికార్డు బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్

రాంచీ టెస్టులో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఒక టెస్టు సిరీస్‌లో 600 పరుగులు సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‍లో ఈ రికార్డును క్రియేట్ చేశాడు. మొత్తం 55 రన్స్ వద్ద 600 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఒకే టెస్టు సిరీస్‌లో 600+ రన్స్ చేసిన 5వ భారతీయ బ్యాటర్‌గా చరిత్ర లిఖించాడు. ఈ రికార్డుతో ఈ 22 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్.. భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలాంటి దిగ్గజ క్రీడాకారుల సరసన చేరాడు.

READ ALSO: కొత్త బ్యాట్ పట్టిన ధోనీ ఎందుకంటే?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS