దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది. స్వీడన్ రిటైలర్ ఐకియాతో రూ. 850 కోట్లు (100 బిలియన్ డాలర్లు) విలువైన డీల్ దక్కించుకుంది. ఈ డీల్ కోసం ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్యాప్ జెమినీ వంటి పెద్ద సంస్థలను దాటుకొని ముందుకు వచ్చింది. ఈ ఒప్పందం కాల పరిమితి 5 సంవత్సరాలు ఉండగా, 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ నౌ, సర్వీస్ డెస్క్ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సర్వీస్ మేనేజ్‌మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ సేవలను ఇన్ఫోసిస్ అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్జూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్ కర్మేష్ వాస్వానీ ఈ డీల్‌కు నేతృత్వం వహించారు. నోర్డియాక్ రీజియన్‌లో ఇన్ఫోసిస్ మరిన్ని డీల్స్ సొంతం చేసుకుంటూ తన సేవలను విస్తరిస్తోంది. ఈ డీల్ కారణంగా 350 ఉద్యోగులు ఇన్ఫోసిస్‌కు మారనున్నారు.

