ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులకు ఇది బ్రహ్మాండమైన శుభవార్తే. గత ఐదేళ్లుగా బ్రాండెడ్ మద్యం కోసం ఎదురుచూసిన వారి ఆశలు ఫలించాయి. ప్రభుత్వం మారడంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతోంది. కొత్త స్టాక్‌తో మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. కింగ్‌ఫిషర్ బీర్లు గొడౌన్లకు చేరుకున్నాయి. ఈ వీడియోను టీడీపీ ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. నెటిజన్లు సంతోషంతో కామెంట్లు పెడుతూ, ఇతర బ్రాండ్లను కూడా కోరుతున్నారు. ఆనం త్వరలో అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నెటిజన్లు మీమ్స్‌తో సెలబ్రేట్ చేస్తున్నారు.