Sunday, November 9, 2025
Homenewsజగన్-ఈవీఎంలపై ట్వీట్: టీడీపీ వ్యంగ్య స్పందన

జగన్-ఈవీఎంలపై ట్వీట్: టీడీపీ వ్యంగ్య స్పందన

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ వాడాలని, ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే న్యాయం జరగడం మాత్రమే కాదని, అది కనిపించాలంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. జగన్ దారుణ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ విమర్శలు చేసింది. గత ఎన్నికల సమయంలో జగన్ మీడియాతో మాట్లాడిన వీడియోను టీడీపీ షేర్ చేసింది. 151 సీట్లు వచ్చినప్పుడు అద్భుతంగా పనిచేసిన ఈవీఎంలు, 11 సీట్లు వచ్చినప్పుడు ట్యాంపరింగ్ అయ్యాయా? అని ప్రశ్నించింది. టీడీపీ వీడియోలో, జగన్ మాట్లాడుతూ ఈవీఎంలు సక్రమంగానే పనిచేశాయని, వీవీప్యాట్‌లో స్పష్టంగా కనిపిస్తుందని, ప్రజలు ఎక్కడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. పోలింగ్ ఏజెంట్లు మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎంలు బాగున్నాయని సంతకాలు పెట్టిన తర్వాతే పోలింగ్ జరుగుతుందని వివరించారు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే అన్నీ బాగున్నట్టేనని, లేదంటే ప్రజా తీర్పును అవహేళన చేస్తూ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS