రేణూ దేశాయ్ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అకీరా నందన్‌ను జూనియర్ పవన్ కళ్యాణ్ అని అనడం అకీరాకు, పవన్‌కి కూడా నచ్చదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో అన్ని సీట్లు గెలిచిన నేపథ్యంలో అకీరా తన తండ్రి కోసం ఓ వీడియో క్రియేట్ చేసాడట. ఆ వీడియోను రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఈ పోస్ట్‌పై పవన్ అభిమానులు కామెంట్స్ పెడుతూ, అకీరా జూనియర్ పవన్ కళ్యాణ్ అని, త్వరగా సినిమాల్లోకి వస్తే బాగుంటుందని అంటున్నారు. అయితే, అకీరా సినిమాల్లోకి వెళ్తానంటే రేణూ ఒప్పుకోవడంలేదని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీనిపై రేణూ స్పందిస్తూ, “అకీరా పుట్టిన క్షణమే తాను అభిమానిగా మారానని, అలాంటిది అకీరా సినిమాల్లోకి వెళ్తానంటే తానెలా ఆపుతానని అనుకుంటున్నారని” మండిపడ్డారు. అకీరా సినిమాల్లోకి ఎప్పుడు వెళ్లాలనుకున్నా అది పూర్తిగా తన నిర్ణయమని, అనవసరంగా ఈ టాపిక్‌లో తనను ఇన్‌వాల్వ్ చేయొద్దని రేణు రిక్వెస్ట్ చేసారు.