Tuesday, April 22, 2025
Homenewsజ్యోతిష్య శాస్త్రంలో తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ...

జ్యోతిష్య శాస్త్రంలో తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇలాంటి తిథుల్లోనే 11వ తిథిని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు

BY Shashank Pasupuleti 

ప్రతి సంవత్సరంలో పుష్య మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం 9:38 గంటల వరకు ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి డిసెంబర్ 23న శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం 7 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. అయితే సూర్యోదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 23న జరుపుకుంటారు.

ఈరోజు ముక్కోటి దేవతలు అంతా కలిసి సాక్షాత్తు శ్రీమహావిష్ణువుతో భూలోకానికి వస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈరోజు చాలామంది భక్తులు ఎంతో పవిత్రంగా శ్రీమహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా ఉపవాసాలు, జాగరణలు కూడా చేస్తూ ఉంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడమాసం నుంచి పుష్య మాసం వరకు వచ్చే ఏకాదశి లకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ముఖ్యంగా చాలామంది తొలి ఏకాదశి రోజున ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల సంతాన సమస్యలు తీరిపోతాయి. ఇక పుష్య మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 23 శుక్రవారం రోజున వచ్చింది. ఈ సమయంలో శ్రీమహావిష్ణు ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని భక్తుల నమ్మకం అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు.

జ్యోతిష్య శాస్త్రంలో తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి తిథుల్లోనే 11వ తిథిని ఏకాదశిగా పిలుస్తారు. జ్యోతిషం శాస్త్రం ప్రకారం ఏకాదశి పౌర్ణమి ముగిసిన తర్వాత 11 రోజుల తర్వాత వస్తుంది. అంతేకాకుండా అమావాస్య వచ్చేముందు 11వ రోజు ఈ ఏకాదశి తిథి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతినెల ఒక ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశిలన్నీ హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనవి. భారతదేశవ్యాప్తంగా చాలామంది తొలి ఏకాదశి..ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

 

ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున చాలామంది భక్తులు ఉపవాసాలు, జాగరణలు పాటిస్తూ ఉంటారు. ఈరోజు చంద్ర, సూర్యుల నుంచి వచ్చే కిరణాలు నేరుగా జీర్ణక్రియ వైపు ప్రభావం చూపుతాయి దీనికి కారణంగా జీర్ణక్రియ సమస్యలు ఏవైనా సులభంగా దూరమవుతాయని శాస్త్రంలో పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే ప్రముఖ దైవ క్షేత్రం.. తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివ్వారిని ఉత్తరం ద్వారం గుండా దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తిరుమలకు వచ్చారు. వీఐపీల వైకుంఠ ద్వారా దర్శనానికి మూడు గంటలు పట్టింది. ఇక 5:14 గంటలకు సర్వ దర్శనం భక్తుల క్యూలైన్‌ ప్రారంభమైంది.భక్తులు ఉదయం నుంచి దర్శనానికి బారులు తీరారు.

వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న ప్రముఖుల్లో.. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార మిశ్రా, సూర్య కాంత్, హిమ కోహ్లీ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఎల్ భట్టి,రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్, కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తారాల రాజశేఖర్, రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, గుడివాడ అమర్నాథ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసన ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉష శ్రీ చరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నిర్మాత బండ్ల గణేష్, ఎంపీలు సిఎం రమేష్, రఘురామ కృష్ణంరాజు, టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు.

ఇక తెలంగాణలో ప్రముఖ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదున్నర నుంచి ఉత్తర ద్వార దర్శనానికి బారులు భక్తులు బారులు తీరారు. అలాగే హన్మకొండలోని హన్మకొండలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, వరంగల్ లోని శ్రీ బాలాజీ ఆలయాలలో హైదరాబాద్ లో నీ ప్రాముఖ్యదేవాలయం వీర ఆంజనేయ ఆలయం , శ్రీరాములువారి ఆలయం షావహ కారిక్రమం మాడవీధుల్లో ఊరేగించారు .

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైష్ణవ ఆలయాలకు వైకుంఠ శోభ సంతరించుఉకంది. మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, జిల్లాలోని వివిధ ఆలయాల్లో వేకువజామున నుంచి భక్తులకు ఉత్తర ద్వారం దర్శనం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయానికి భక్తులు పెత్త ఎత్తును పోటేత్తారు.

ఇక తెలంగాణలో ప్రముఖ ఆలయం యాద్రాదికి కూడా భక్తులు పోటేత్తారు. యాదాద్రిలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు దర్శనమిస్తున్నారు. స్వామి వారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు.

ఇలాంటి ప్రత్యేకమైన రోజున మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు..

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS