BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్
ఆలేరు, బొమ్మలరామారం. డిసెంబర్ 6 (వర్డ్ ఆఫ్ ఇండియా)
ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలువేరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బిర్ల ఐలయ్య గెలుపుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, యువతకు మరియు ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ శాఖ అధ్యక్షులు, వారితో సమన్వయపరచుకొని ముందుకు నడిపించిన సీనియర్ కార్యకర్తలు మరియు యువకుల కృషి ఎంతో గొప్పదని కొనియాడుతూ, ఇలాంటి స్ఫూర్తి నేటి సమాజానికి అవసరమని ఆయన అన్నారు. ఐలయ్య గెలుపునకు కృషి చేసిన ఆలేరు ప్రజలందరికీ ఐలయ్య రుణపడి ఉంటారని, ఇచ్చిన హామీల పట్ల కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
మండలాల వారిగా ఎన్నో సమస్యల పరిష్కారం దిశగా ముందుండే వ్యక్తి మనఎమ్మెల్యే ఐలయ్య అని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఆయన గెలుపుకు సహకరించిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలోఆయన వెంట చిలువేరు అచ్చిరెడ్డి, దివాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, తాళ్ల రవీందర్ రెడ్డి, గోలిపల్లి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ మందాల రామస్వామి, మాజీ జెడ్పిటిసి చీర్ల రాజేశ్వర్ యాదవ్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, వార్డు మెంబర్ కొక్కొండ నరేందర్ రెడ్డి, పల్లె కృష్ణ గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఉప సర్పంచ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బేతాళ శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.