మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. ఒకప్పుడు విజయం ధృవీకరించుకున్న జగన్, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా ప్రతిపక్ష హోదాను కోల్పోయారు. వైజాగ్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పిన జగన్, ఇప్పుడు పార్టీ నాయకులతో ప్రజల కోరికలు తెలుసుకుని మళ్లీ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ కేసులపై ఫోకస్ చేశారు. ఈ నెలలోనే జగన్ సీబీఐ విచారణ మళ్లీ మొదలవుతుంది. అక్రమ ఆస్తుల కేసులో బెయిల్ రద్దు అవకాశం ఉంది. జగన్ జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏమిటి అనే చర్చ ప్రారంభమైంది. జగన్ జైలుకి వెళ్తే పార్టీని నడిపేందుకు షర్మిళ లేదా, తల్లి విజయమ్మ కూడా షర్మిళకే మద్దతు తెలిపారు. కాబట్టి జగన్ భార్య భారతి రెడ్డికి పార్టీ పగ్గాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆమె మాట వినేవారు తక్కువ మంది. భారతి ఎమ్మెల్యేగా గెలిస్తే పరిస్థితి మారొచ్చు. జగన్ తన స్థానంలో భారతిని నిలబెట్టి గెలిపించే అవకాశాలు ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి.