మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని జీడిమెట్ల సర్వే నెం.82లో మల్లారెడ్డి కుటుంబం 33 గుంటల భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు నిజాన్ని నిగ్గు తేల్చారు. సుచిత్రలోని సర్వే నెం. 82లో వివాదాస్పద భూమిపై హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, మల్లారెడ్డి కుటుంబం భూ కబ్జాకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. హైకోర్టు ఈ భూమికి రక్షణ కల్పించాలని సూచించింది. ఈ పరిణామంతో మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఆయనపై అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అరెస్ట్ తప్పదని వాదనలు వినిపిస్తున్నాయి.