వైఎస్సార్ కాంగ్రెస్ నేత గుడివాడ అమర్నాథ్ రుషికొండపై నిర్మించిన భవనాల పై వివరణ ఇచ్చారు. పర్యాటక శాఖ అభివృద్ధి కింద నిర్మించిన ఈ భవనాలను జగన్ మోహన్ రెడ్డి సొంత ఇళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీపై అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులు, రాష్ట్రపతులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వంటి వీఐపీ అతిథుల కోసం నిర్మించిన ఈ భవనాలు, భద్రతా పరమైన లోపాలకు గురి అవుతాయని హెచ్చరించారు. రుషికొండ ఎదురుగా ఉన్న గీతం కాలేజీ అక్రమ కట్టడాలపై కూడా దృష్టి పెట్టాలని కోరారు.

