బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివాసంలోకి నటి అదా శర్మ ప్రవేశించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ముంబై బాంద్రాలో ఉన్న సుశాంత్ నివాసాన్ని అమ్మకానికి పెట్టారు. అయితే, సుశాంత్ ఆత్మహత్య చేసిన కారణంగా చాలా మంది ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి భయపడ్డారు. కానీ అదా శర్మ మాత్రమే ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఆ ఇంటికి కొనుగోలు దారులు దొరక్కపోవడంతో ధర తగ్గించారు. తక్కువ ధరకు అందుతున్నదనే కారణంతో అదా శర్మ ఆ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. నిన్ననే ఆమె ఆ ఇంట్లోకి మారారు. ఆ ఇంట్లోకి వెళ్లగానే పాజిటివ్ వైబ్స్ వచ్చాయని అన్నారు. 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 14న ఆయన చనిపోయి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటికీ సుశాంత్ మరణంపై పోలీసులు కానీ సీబీఐ కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, న్యాయం చేయలేదని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.