ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత, రాజధాని లేని విభజిత ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగుతుంది. విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రత బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ఇప్పుడీ గడువు ముగియడంతో ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది. ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు. 2019లో అధికారాన్ని చేజిక్కిన వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చినా, రాజధాని విషయంలో ఏపీలో సరిచూసుకునే స్థితి లేదు.