Thursday, April 23, 2026
Homenewsఎన్డీయే కూటమికి వైసీపీ అవసరమా?

ఎన్డీయే కూటమికి వైసీపీ అవసరమా?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “లోక్ సభలో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. మా పార్టీకి పార్లమెంట్ ఉభయ సభల్లో 15 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. ఎన్డీయే కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో బీజేపీకి మా పార్టీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి. పార్లమెంటులో టీడీపీపై ఎంత ఆధారపడతారో, వైసీపీపైనా అంతే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది” అని విజయసాయిరెడ్డి వివరించారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS