Wednesday, April 23, 2025
HomeFree Haleem: హోటల్ కొంప ముంచిన ఫ్రీ హలీమ్ ఆఫర్

Free Haleem: హోటల్ కొంప ముంచిన ఫ్రీ హలీమ్ ఆఫర్

రంజాన్ మాసంలో మొదటి రోజు సందర్భంగా ఫ్రీగా హలీమ్(Free Haleem) అందించాలని భావించారు.. హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ హోటల్ యాజమాన్యం. ఆ హోటల్ యాజమాన్యం ఊహించిందొకటి.. కానీ అక్కడ జరిగింది మరొకటి.

ఉచితంగా హలీమ్(Free Haleem) అందించాలని భావించినందుకు.. ఫలితంగా ఆ హోటల్ మీదనే పోలీసులు కేసు పెట్టే వరకు వచ్చింది పరిస్థితి. అందుకు కారణం.. వాళ్లు అందించే ఉచిత హలీమ్ తినేందుకు వందల సంఖ్యలో జనం పోటెత్తటమే.

ఫ్రీగా హలీమ్(Free Haleem) ఇస్తున్నారని తెలియటంతో.. ఒక్కసారిగా వందలాది మంది హోటల్‌కు దూసుకొచ్చారు. దీంతో.. హోటల్ ముందు జనం రద్దీతో గందరగోళం నెలకొంది. జనాన్ని అదుపు చేయటం హోటల్ సిబ్బంది వల్ల కాకపోవటంతో పరిస్థితి అదుపు తప్పింది.

దీంతో హోటల్ యాజమాన్యం వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లాఠీలకు పని చెప్పారు. ఈ కారణంగా రంజాన్ రోజు ఆ మార్గంలో చాలా సేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఎపిసోడ్‌కు కారణమైన అజీబో హోటల్‌ మీద పోలీసులు న్యూసెన్స్ కేసుతో పాటు ట్రాఫిక్ రద్దీకి కారణమైనందుకుగానూ కేసులు నమోదు చేశారు. దీంతో.. ఆ హోటల్ యాజమాన్యం పరిస్థితి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టు మారింది.

READ LATEST TELUGU NEWS: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై .. రూ.15 కోట్ల అప్పులు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS