Monday, June 16, 2025
HomenewsBhadrachalam : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక

Bhadrachalam : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక

Bhadrachalam : శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 17 భద్రాచలంలో రామయ్య కల్యాణోత్సవం జరగనుంది. రామయ్య, సీతమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వెళతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ సీతమ్మవారి కోసం అరుదైన చీరను తయారు చేశారు.రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేసినట్లు విజయ్ తెలిపారు. ఇందుకు రూ.48 వేలు ఖర్చయిందని.

ఈ నెల 16న చీరను భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు. ఇక సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల నుండి సీతమ్మకు పెండ్లి చీర వెళ్లనుంది. ప్రతి సంవత్సరం కళ్యాణానికి చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఆనవాయితీగా చీరను పంపిస్తున్నాడు. ఈసారి తన చేనేత నైపుణ్యాన్ని ఉపయోగించి చేనేత మగ్గంపై సీత రాముల కళ్యాణం జరిగే తీరు, చీర అంచులో భద్రాద్రి దేవాయాయంలో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు వచ్చే విధంగా చీరను నేశాడు. చీర మొత్తం శంకు, చక్ర నామాలతో పాటు బార్డర్‌లో జైశ్రీరామ్ అనే అక్షరాలు వచ్చే విధంగా చీరను తయారు చేశాడు. ఆరు రోజుల పాటు శ్రమించి ఈ చీరను తయారు చేసినట్లు హరిప్రసాద్ వెల్లడించారు.

న్యూయార్క్‌ కు చెందిన ‘న్యూస్‌ వీక్‌’ మ్యాగ్‌జైన్‌కు మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ

ఈ చీర బరువు 800 గ్రాములు ఉండగా, ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలు ఉపయోగించినట్లు చెప్పారు. చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మని నేయడం ఈ చీర విశేషమన్నారు. ఈ చీరను నేడు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చూపించి, ఆ తర్వాత భద్రాద్రి దేవస్థానానికి అందిస్తానని హరిప్రసాద్ తెలిపాడు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS