Sunday, July 13, 2025
HomenewsBhadrachalam : భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

Bhadrachalam : భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

Bhadrachalam : భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్ర భాత సేవ, ఆరాధన, బాలభోగం నివేదనా సేవాకాలం,బలిహరణ, మంగళాశాసనం చేశారు. భద్రుని సన్నిధిలో స్వామికి విశేష అభిషేకం నిర్వహించారు. రాజలాంఛ నాలతో గోదావరి నుంచి తీర్థపు బిందెను తెచ్చారు. అనంతరం కల్యాణమూర్తులను ఊరేగింపుగా ఆలయం నుంచి మిథిలాప్రాం గణానికి తీసుకొచ్చారు. మండపానికి సీతా రాములు చేరుకోగానే అర్చక స్వాములు నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు.

అనంతరందేవనాద రామానుజ జీయర్ పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీరా మమహాపట్టాభిషేకం వేడుకను ప్రారంభిం చారు. రాజనీతిని తెలియజేసే రాజదండం, రాజముద్రిక, భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరాముడికి, చింతాకు పతకం సీతమ్మకు, శ్రీరామమాడ లక్ష్మణ మూర్తికి అర్చకులు భక్తుల జయజయధ్వా నాలు, మేళతాళాలు నడుమ అలంకరించా రు. చామరం, బంగారు ఛత్రం, దుష్ట శిక్షణ కోసం రాజఖడ్గాన్ని రామయ్యకు అందజేశా రు. సామ్రాట్ కిరీటాన్ని స్వామి వారికి అలం కరించే ఘట్టంతో మహాపట్టాభిషేక క్రతువు ముగిసింది. దేవేంద్రుడి కానుకగా ముత్యాల హారం రామయ్యకు అలంకరించారు. ఆ తర్వాత సీతమ్మకు, అక్కడి నుంచి వారి అపరభక్తుడు ఆంజనేయస్వామికి సమర్పిం చారు. ఇన్ చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ రాజవస్త్రాలను సమర్పించారు. అష్టోత్తర శతహారతితో క్రతువు ముగిసింది.

సీతారాముల కల్యాణం కోసం ముఖ్య మంత్రి దంపతులు లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టువస్త్రాలు సమర్పించడం, మరుసటి రోజు జరిగే పట్టాభిషేక మహో త్సవానికి గవర్నర్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు అందించడం భద్రాచలం ఆలయ ఆనవాయితీ. ప్రత్యేక హెలికాప్ట ర్లో భద్రాచలం చేరుకున్న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ ప్రియాంక ఆల, ఈవో రమాదేవిల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS