By శశాంక్ పసుపులేటి
Cow Cattle Transport in Suryapet District : సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మట్టపల్లిలో కంటైనర్లో గోవులను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 26 ఆవులను పట్టుకున్నారు. పలు ఆవులు పల్నాడు జిల్లా గురజాలకు చెందినవిగా గుర్తించారు. మొత్తం 26 ఆవుల్లో 15 ఆవులు ఊపిరాడక మృత్యువాత పడ్డాయి.
తొమ్మిది ఆవులను నల్గొండ గోశాలకు తరలించగా, రెండు ఆవులు కాలువిరిగిన పరిస్థితిలో చికిత్స పొందుతున్నాయి. ఈ ఘటన నిన్న ఉదయం మట్టపల్లి చెక్పోస్ట్ వద్ద 10 గంటలకు జరిగింది. సెటిల్మెంట్ కుదరక, ఉన్నతాధికారికి తెలియజేసిన తర్వాత రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్ చేసిన ఎస్సై రామాంజనేయులు.
ఎస్పీ రాహుల్ హెగ్డే, మఠంపల్లి పోలీసులపై విచారణకు ఆదేశించారు. ఎస్సై రామాంజనేయులు నిర్లక్ష్యం వల్ల 16 ఆవులు చనిపోయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.