విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ కేసు(Visakha Drug Case)లో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విశాఖ పోర్టులో పట్టుబడ్డ 25 వేల కేజీల కొకైన్, మాదకద్రవ్యాలపై ఆరా తీయనున్నారు.
వేల కోట్ల రూపాయల డ్రగ్ రాకెట్ ను ఇంటర్‌పోల్ గుర్తించడంతో.. ఆపరేషన్ ‘గరుడ’లో భాగంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దాంతో సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
అయితే దేశంలోని వివిధ పోర్టులకు డ్రై ఈస్ట్ దిగుమతి అవుతోంది. విశాఖకు పెద్ద ఎత్తున యురోపియన్ దేశాల నుంచి ప్రతీ నెలా ఐదారు కంటైనర్లలో డ్రై ఈస్ట్ దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ ఈ అంశంపై వివరణ ఇచ్చింది.
ఎగ్జిక్యూటవ్ డైరెక్టర్ హరి పేరుతో ఆర్డర్లు పెట్టినట్లు సంధ్యా సంస్థ తెలిపింది. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్‌లో ఐసీసీబీ అనే కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే ఈస్ట్ కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
ఓషన్ నెట్వర్స్ ఎక్స్‌ప్రెక్స్ ఎల్‌బీ 224348 సీల్‌లో ఉన్న కంటెయినర్ జర్మనీ మీదుగా మార్చ్ 16న విశాఖ పోర్టుకు వచ్చింది. మార్చి 19న సంధ్యా ఆక్వా ప్రతినిధుల సమక్షంలో సీబీఐ బృందం కంటైనర్‌ను పరిశీలించింది. అందులో మాదక ద్రవ్యాలు(Visakha Drug Case) ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
కానీ అవి డ్రగ్స్ కాదని బ్రెజిల్ కంపెనీ నిర్ధారిస్తామంటుందని సంధ్యా ఆక్వా యాజమాన్యం చెబుతోంది. అదే సమయంలో సీబీఐ విచారణకు సహకరిస్తామంటుంది. అయితే, ఏపీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో ఏకంగా 25 వేల కిలోల మత్తు పదార్థాలను((Visakha Drug Case) గుర్తించారు సీబీఐ, కస్టమ్స్ అధికారులు. వైజాగ్‌లో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ లోడ్ బుక్ అయ్యింది.
ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ లోడ్ వస్తుందని ఈ నెల 18న ఇంటర్‌పోల్.. ఢిల్లీలోని సీబీఐకు సమాచారం ఇచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు హెచ్చరించింది. దీంతో వెంటనే ఆపరేషన్ గరుడ చేపట్టింది సీబీఐ.
విశాఖలోని సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులు. జనవరి 14న బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్ట్‌లో బయల్దేరిన సరుకు రవాణా నౌక.. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖ చేరింది.
షిప్ తీరానికి చేరగానే కంటైనర్‌ను చెక్ చేశారు దర్యాప్తు బృందం అధికారులు. ఇందులో 25 కిలోల చొప్పున డ్రై ఈస్ట్‌తో మిక్స్ చేసిన డ్రగ్స్ వెయ్యి బ్యాగుల్లో నింపి ఉన్నాయి. ఈ నెల 19నే నార్కోటిక్స్ మెటీరియల్, నిపుణుల బృందంతో వచ్చిన సీబీఐ.. కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు నిర్థారించింది.
సీజ్ చేసిన కొకైన్ విలువ 50 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆపరేషన్ గరుడలో భాగంగా డ్రగ్స్‌ను సీజ్ చేసిన సీబీఐ.. ఏ1గా సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్‌ను చేరుస్తూ(Visakha Drug Case) కేసు నమోదుచేసింది.
అయితే తాము ఈ ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించామని, రొయ్యల మేత తయారీకి సంబంధించిన ముడి సరుకు డ్రై ఈస్ట్‌ను బ్రెజిల్ నుంచి తెప్పించామంటున్నారు ఆక్వా కంపెనీ ప్రతినిధులు. 19న సరుకును ల్యాబ్ టెస్ట్‌కు తీసుకెళ్లారని, ఇవాళ మరోసారి చెకింగ్ జరుగుతుందని అన్నారు.
తాము ఆర్డర్ చేస్తే డ్రై ఈస్ట్ వచ్చిందని తాము భావించామని, అసలందులో ఏముందో తమకు తెలీదంటున్నారు ఆక్వా కంపెనీ ప్రతినిధులు. డ్రగ్స్ అంటుంటడంతో ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని, తాము మాత్రం సీబీఐ విచారణకు సహకరిస్తామంటున్నారు సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులు.
ఏదేమైనా డ్రై ఈస్ట్ ఆర్డర్ చేస్తే.. డ్రై ఈస్ట్ మిక్స్‌తో డ్రగ్స్ ఎలా వచ్చాయన్నది విచారణలో తేలాలి. దీనికి వెనకున్నది అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా అయితే.. అసలు నిందితులను పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో సీబీఐ సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంటుంది.
మరోవైపు డ్రగ్స్ కంటైనర్ వేదికగా రాజకీయ విమర్శలు వస్తున్నాయి.. ఎన్నికల తరుణంలో అస్త్రంగా మారింది వైజాగ్ డ్రగ్స్ కేసు(Visakha Drug Case).. తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు.
సంధ్యా ఎక్స్పోర్ట్స్‌తో రాజకీయ పార్టీల సాన్నిహిత్యంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఏ రాజకీయ పార్టీతోనూ తమకు సంబంధం లేదని సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రకటించింది. కేవలం రొయ్యల మేతలో వినియోగించే ఈస్ట్ కోసమే ఆర్డర్ చేశామని చెబుతోంది.
READ LATEST TELUGU NEWS: దేశం మంగళగిరివైపు చూసేలా చేస్తా: నారా లోకేష్