Saturday, June 21, 2025
HomeMegastar Watch: రూ.1.90 కోట్లా? చిరు వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిల్ అవ్వొచ్చు

Megastar Watch: రూ.1.90 కోట్లా? చిరు వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిల్ అవ్వొచ్చు

సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ నోవాటెల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి చేతికి ఉన్న వాచ్(Megastar Watch) చాలా మందిని ఆకర్షించింది.

మరి ఆ వాచ్ డీటైల్స్ చూద్దామా?

సాధారణంగా సెలబ్రెటీలు వాడే వస్తువులు చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలోనే మోస్ట్ స్టైలిష్, నం.1 బ్రాండ్స్‌ను వాళ్లు ఉపయోగిస్తుంటారు. ఇక చిరంజీవి ఈ వేడుకకి పెట్టుకున్న వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందినది.

కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్‘‌ పేరుతో పిలిచే ఈ వాచ్(Megastar Watch) ధర దాదాపు రూ. 1.90 కోట్లు వరకూ ఉంటుందని అంచనా. ఇందులో మోడల్స్ బట్టి ధరలో కాస్త మార్పులు కూడా ఉన్నాయి.

చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ ఈ వాచ్ ధర మాత్రం భారీగా ఉంది. రోలెక్స్‌కి చెందిన టాప్ మోడల్స్‌లో ఈ వాచ్ కూడా ఒకటి…. ఇక ఈ వాచ్ ధర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అయితే చిరు ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

READ LATEST TELUGU NEWS: నెట్టింట వైర‌ల్ అవుతున్న మెగాస్టార్ 10వ త‌ర‌గ‌తి స‌ర్టిఫికేట్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS