కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ ఆలయ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తుండగా ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కింద పడేసి, మరో ఏనుగుపై దాడి(Elephant Fight)కి ప్రయత్నించింది.
ఏనుగుల కొట్లాటతో వేడుకలను చూసేందుకు వచ్చిన జనం భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. త్రిస్సూర్ జిల్లా అరట్టుపుజ గ్రామంలోని థారక్కల్ ఆలయంలో శుక్రవారం రాత్రి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు అకస్మాత్తుగా మరో ఏనుగుపై దాడి(Elephant Fight) చేసింది. దీంతో ఆ ఏనుగు పరుగందుకుంది.
దాదాపు ఏనుగు కిలోమీటర్ దూరం పరిగెత్తింది. నియంత్రించేందుకు ప్రయత్నించిన మావటి శ్రీకుమార్ పైనా అది దాడి చేసింది. పైనుంచి కిందపడేయడంతో గాయపడ్డ శ్రీకుమార్‌ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చాలామంది కిందపడి గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ఎలిఫెంట్ స్క్వాడ్ అతికష్టమ్మీద రెండు ఏనుగులను కంట్రోల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ LATEST TELUGU NEWS: శివుడికి తులసీ, కుంకుమలతో పూజలు వద్దు.. ఏం చేయాలంటే?