Hawa Ceiling Fans: విశాఖపట్నానికి చెందిన ఓ 31 ఏళ్ల కుర్రాడు ప్రకృతి మీద ప్రేమతో వ్యాపారం మొదలెట్టాడు. పర్యావరణంలో సమతుల్యతే ధ్యేయంగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతడే హవా సీలింగ్ ఫ్యాన్స్ కంపెనీ స్థాపకుడు అనిల్ గోవింద్ బోండా.
స్కాట్లాండ్‌లోని హైలాండ్స్ అండ్ ఐలాండ్స్ యూనివర్సిటీలో అతడు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్‌లో పట్టా సాధించాడు. అయినా వాతవరణంలో సమతుల్యత కొనసాగాలనే ఉన్నత ఆశయంతో ఆకాశంలో తిరిగే ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ఇంటి పైకప్పున తిరిగే సీలింగ్ ఫ్యాన్ వరకు దిగివచ్చాడు.
యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే అనిల్ గోవింద్‌కు హవా కంపెనీ స్థాపించాలనే ఆలోచన వచ్చింది. శక్తి-సామర్థ్యం అనే అంశంపై ఓ స్టూడెంట్‌గా ఆయన ఎంతో పరిశోధన చేశాడు.
తన ప్రాజెక్ట్ కూడా ఇదే అంశం అవ్వడంతో అనిల్ చాలా లోతుగా విశ్లేషించాడు. పర్యావరణహితంగా తయారయ్యే వస్తులపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తూ శక్తి-సామర్థ్యాలను ప్రోత్సహిస్తుండటం ఆయన ఆలోచనకు మరింత ఉత్సాహానిచ్చింది. అనుకుందే తడవుగా సీలింగ్ ఫ్యాన్ ఇండస్ట్రీలో అనిల్ అడుగుపెట్టాడు.

పారిశ్రామిక రంగంలో ఎన్నో ఆటుపోటులను తట్టుకుంటూ అనిల్ ప్రయాణం చేశారు. మార్కెట్ తీరు, టెక్నాలజీలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకుంటూ పోటీలో నిలదొక్కుకుంటూ ఒక్కో అడుగువేశారు.
అలా మొదలైన తన ప్రస్థానం నేడు హవా కంపెనీని ఇండస్ట్రీలో ఒకటిగా నిలబెట్టింది. పర్యావరణ సమతుల్యతపై తమ సంస్థ తీసుకునే నిర్ణయాలు ‘హవా’కు ప్రత్యేకగుర్తింపు తీసుకొచ్చాయి.
హవా అంటే హిందీలో గాలి అని అర్థం. అందుకే చల్లని గాలి అందించే తమ సీలింగ్ ఫ్యాన్ కంపెనీకి ఆ పేరు పెట్టుకున్నట్లు చెబుతారు.. అనిల్.
Read Also: పాస్ అయింది పదే కానీ 26 ఏళ్లకే రూ. 416 కోట్ల డీల్ కొట్టిన భారతీయుడు
వాతావరణంలో మార్పులకు తగ్గట్లుగా తమ సీలింగ్ ఫ్యాన్ (Hawa Ceiling Fans) ఉత్పత్తులుంటాయని అనిల్ అంటారు. ఇక పట్టుదలతో పనిచేసే బృందం, ప్రతీక్షణం ఉత్సాహం చూపించే డిస్ట్రిబ్యూటర్లు, కుటుంబంలా కష్టపడే సిబ్బంది సాయంతో హవా దక్షిణ భారతదేశంలో పేరుకు తగ్గట్టుగానే తమ హవా చూపిస్తోంది.
When you think of fans, do you also think of energy efficiency? We’re sure you will after seeing this! 🔥👌
A BLDC fan is the ultimate multitasker. It can keep you cool in summer, warm in winter, and silent all year long. 💯👏#bldcfans #ceilingfans #smartfans pic.twitter.com/d59HHFkvcn
— Hawafansofficial (@Hawafans) May 6, 2023
హవా కంపెనీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో తమ సేవలను అందిస్తోంది.
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్తకొత్త మోడల్స్‌తో సీలింగ్ ఫ్యాన్లను ఆవిష్కరిస్తోంది. పేరుగు తగ్గట్టుగానే అనిల్ కంపెనీ దేశంలోని మూలమూలలకు చల్లనిగాలి అందిస్తోంది.
50 మంది ఉద్యోగులు, 100 మంది సిబ్బందితో హవా సీలింగ్ కంపెనీ కలసికట్టుగా ముందడుగేస్తూ పర్యావరణ సమతుల్యతకై పాటుపడుతోంది.
‘హవా‘ వెనక అనిల్ గోవింద్ అసామాన్యమైన కృషి ఉంది. పర్యావరణాన్ని కాపాడటానికి మొదలుపెట్టిన ఈ సంస్థ లక్ష్యాలు సాధించడం కోసం అనుక్షణం ఆయన పరితపిస్తూనే ఉన్నారు.
పర్యావరణ సమతుల్యతను తన బాధ్యతగా భావిస్తూ భావిభారత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. హవా(Hawa Ceiling Fans) అంటే ఒక బ్రాండ్ కాదు.. ఓ మార్పు. ఈ చల్లనిగాలి దేశంలోని ప్రతీమూలకు వీయాలని మనమూ ఆకాంక్షిద్దాం.
READ LATEST TELUGU NEWS: 4 నెలల మనుమడికి రూ.240 కోట్ల విలువైన షేర్స్ గిఫ్ట్