ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో సెన్సేషనల్ రికార్డు సాధించాడు. తాజాగా బన్నీ ఇన్‌స్టాగ్రామ్(Allu Arjun Instagram)లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. దీంతో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డులకెక్కాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun Instagram) తర్వాత విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), రామ్ చరణ్ (20.8 మిలియన్లు), దుల్కర్ సల్మాన్ (14.1 మిలియన్లు), యశ్ (13.5 మిలియన్లు), మహేష్ బాబు (13.4 మిలియన్లు), ప్రభాస్ (11.7 మిలియన్లు), దళపతి విజయ్ (10.8 మిలియన్లు) ఉన్నారు.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప-2’ మూవీలో నటిస్తున్నాడు. ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలోకి రానుంది.
‘పుష్ప-2’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయనున్నాడని సమాచారం. కాగా.. పుష్ప సినిమాలోని నటనకుగానూ బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
READ LATEST TELUGU NEWS: రామ్ చరణ్ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్!