Easter In Medak CSI Church: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఆనవాయితీ ప్రకారం శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలో ప్రతిష్టించారు. ఈ తెల్లవారుజామున కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఏసుక్రీస్తును గుర్తు చేసుకుంటూ పాటలు పాడారు. ఈస్టర్ వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో మెదక్ చర్చి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.
మానవాళి కోసం ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన మూడో రోజు సమాధి నుండి సజీవంగా తిరిగిలేచారని బైబిల్ చెపుతోంది. క్రీస్తు పుట్టిన రోజైన క్రిస్మస్ తరువాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉంది.
ఈస్టర్(Easter In Medak Church) పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం ఆచారంగా వస్తోంది. ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి.
ఈ నలభై రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్ధాలు, నగదును పేదలకు ఈస్టర్ రోజు(Easter In Medak CSI Church)న క్రైస్తవులు దానం చేస్తారు.
READ LATEST TELUGU NEWS: రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ