మీడియా టైకూన్, ప్రముఖ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇప్పటికే 4 పెళ్లిల్లు, 5 సార్లు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న మర్దోక్ 93 ఏళ్ల వయసులో మరోసారి మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవా(Elena Zhukova)తో తాజాగా ఆయన ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ ఫేమస్ ఆస్ట్రేలియా-అమెరికన్ బిలియనీర్ ఇప్పటికే తన నలుగురు భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇక ఐదో భార్యగా తన ప్రేయసి ఎలీనాను జూన్ నెలలో వివాహమాడనున్నట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని తన ఎస్టేట్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభగంగా జరగనుందట. ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందాయట.
అయితే గతేడాది ఆన్ లెస్లీ స్మిత్‌తో మర్దోక్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇది ఆయనకు ఆరవ ఎంగేజ్‌మెంట్. వారి బంధం నెలరోజులు కూడా నిలవలేదు. పెళ్లికిముందే వీరిద్దరూ విడిపోయారు.
ఎవరీ ఎలీనా జుకోవా?
రష్యాకు చెందిన ఎలీనా జుకోవా మధుమేహం పరిశోధనలో స్పెషలిస్ట్. మాలిక్యులర్ బయోలాజిస్ట్‌గా సేవలందించారు. 1991లో మాస్కో నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. అయితే ఇటీవల మర్దోక్ మూడో భార్య డెంగ్ ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకే మర్దోక్, ఎలీనాల ప్రేమకు వేదికైంది.

కాగా.. ఎలీనాకు గతంలో మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్‌తో పెళ్లి అయింది. వీరిద్దరికి కుమార్తె దాషా కూడా ఉంది. అలెగ్జాండర్‌తో విడిపోయిన ఆమె జూన్‌లో తన ప్రేమికుడు మర్దోకును మ్యారేజ్ చేసుకోబోతుంది.
మర్దోవ్‌కు పెళ్లిళ్లు.. విడాకులు కొత్తేం కాదు
1950వ దశకంలో మీడియా రంగంలో కెరీర్ మొదలుపెట్టారు.. రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch). న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ న్యూస్ పేపర్లను స్థాపించారు. ఆ తర్వాత ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అనంతరం న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి ప్రముఖ పబ్లికేషన్ సంస్థలను కొనుగోలు చేశారు.

1996లో ఫాక్స్ న్యూస్ ప్రారంభించిన రూపర్ట్ మర్దోక్.. 2013లో న్యూస్ కార్ప్ సంస్థను మొదలుపెట్టారు. తన కెరీర్‌లో అనేక వివాదాలు ఎదుర్కున్న మర్దోక్ 2011లో ఫోన్ హ్యాకింగ్ కుంభకోణంలో విమర్శలపాలయ్యారు. ఈ క్రమంలో న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికను మూసివేయాల్సి వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో తన వ్యాపారాలను కుమారులకు అప్పగించిన మర్దోవ్.. ఆయా కంపెనీలకు గౌరవ ఛైర్మన్ హోదాలో కొనసాగుతున్నారు.
కాగా.. మర్దోక్ మొదటి వివాహం ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్ అనే మహిళతో జరిగింది. వీరు 1960లో విడిపోయారు. ఆ తర్వాత జర్నలిస్ట్ అన్నా మరియాను పెళ్లి చేసుకున్నారు.. మర్దోక్. వీరిద్దరూ విడాకులు తీసుకుని దూరమయ్యారు. అప్పుడు ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తిని భరణంగా చెల్లించాడు. అది అత్యంత ఖరీదైన భరణంగా రికార్డులకెక్కింది.
అనంతరం చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్‌ను మర్దోక్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆమెతో కూడా విడిపోయారు. మళ్లీ అమెరికా మోడల్ జెర్రీ హాల్‌ను పెళ్లి చేసుకున్నా వివాహబంధం కొనసాగలేదు. 2023లో ఆన్ లెస్లీని ఎంగేజ్‌మెంట్ చేసుకున్న మర్దోక్.. నెలరోజుల్లోనే వివాహం క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ మీడియా రారాజు త్వరలో ఎలీనాను పెళ్లాడబోతున్నారు.
READ LATEST TELUGU NEWS : ఆయన ఐటీ కింగ్.. కూతురు బ్రిటన్ ప్రధాని భార్య కానీ ఎంతో సింపుల్