Wednesday, April 23, 2025
Homenewsకుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 74 మంది మృతి

కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 74 మంది మృతి

విషాదం: ఉక్రెయిన్ సరిహద్దులో కూలిన రష్యా యుద్ధ విమానం

By CORRESPONDENT

ఉక్రెయిన్ సరిహద్దులో రష్యాకు చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 74 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ సమీపంలో గల బెల్గోరాడ్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు రష్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి గురైన సైనిక విమానం IL-76లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు.. 9 మంది సిబ్బంది ఉన్నట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను స్పెషల్ మిలిటరీ కమిషన్ సేకరిస్తోంది.

అదుపుతప్పిన యుద్ధ విమానం IL-76 వేగంగా కిందపడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విమానం నివాస ప్రాంతాల సమీపంలో నేలను ఢీకొట్టి కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. కాగా ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను బెల్గోరాడో ప్రదేశానికి తరలిస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రష్యా అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ విమానాన్ని తమ రక్షణ బలగాలే కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. IL-76 విమానంలో యుద్ధ ఖైదీల పేరుతో రష్యా క్షిపణులను తరలిస్తోందని అక్కడి మీడియా పేర్కొంది. కానీ రష్యా మాత్రం విమానంలో మరణించింది.. యుద్ధ ఖైదీలేనని వాదిస్తోంది. ఈ అంశంపై రష్యా పార్లమెంట్ స్పీకర్ వ్యచెస్లవ్ వొలొదిన్ స్పందించారు. వారి దేశ సైనికులు వెళ్తున్న విమానాన్ని ఉక్రెయిన్ కూల్చేసిందని ఆరోపించారు. అందులో మానవతా మిషన్‌లో భాగమైన తమ సిబ్బంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ IL-76 సైనిక రవాణా విమానాల్లో సైనిక దళాలు, సరుకులు, మిలిటరీ సాధనాలను తరలిస్తుంటారు. ఈ తరహా యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కూడా వినియోగిస్తుంటారు.

Read Also: CM Mamata Benerjee Met with Car Accident 

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS