Monday, June 16, 2025
HomeCroploss compensation: నష్టం పరిహారం అందిస్తాం: మంత్రి జూపల్లి

Croploss compensation: నష్టం పరిహారం అందిస్తాం: మంత్రి జూపల్లి

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈదులు గాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే.. పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  ప్రభుత్వం పరిహారం(Croploss compensation) అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ఎకరానికి 10 నుంచి 15 వేల వరకు పరిహారం అందిస్తామంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు(Croploss compensation) అడిగి తెలుసుకున్నారు మంత్రి జూపల్లి. రైతులెవ్వరూ అధైర్యపడొద్దని.. జరిగిన నష్టంపై సర్వే పూర్తయిన వెంటనే.. ఎకరాకు 10 నుంచి 15 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు.. రాష్ట్రంలోని 69 లక్షల రైతులకుగానూ 58 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేశామని మంత్రి జూపల్లి చెప్పుకొచ్చారు. మిగిలిన రైతులకు త్వరలోనే నగదు బదిలీ చేస్తామని వెల్లడించారు.

READ LATEST TELUGU NEWS: సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS