Thursday, April 24, 2025
HomeHaryana New CM: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ శైనీ

Haryana New CM: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ శైనీ

హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ శైనీ (Haryana New CM) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నయాబ్ సింగ్ శైనీ 2023 అక్టోబర్‌లో హర్యానా రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీఎం కుర్చిలో కూర్చున్నారు.

ఈరోజు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం ఆయన ఈ తీసుకున్నారు. అలా జరిగిన గంటల్లోనే నయాబ్ సింగ్ శైనీ (Haryana New CM) సీఎం పదవిని అధిష్ఠించారు.

ప్రస్తుతం హర్యానాలో భారతీయ జనతా పార్టీ, దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్‌ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే జేజేపీతో విభేదాల నేపథ్యంలో పొత్తును తెగతెంపులు చేసుకున్న బీజేపీ..సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో పాటు బీజేపీకి ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది.

 

READ LATEST TELUGU NEWS: పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ప్రమాదమా ?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS