Thursday, April 24, 2025
HomeNayanthara Advertisement Remuneration: 50 సెకన్ల యాడ్‌కి రూ.5 కోట్లా?

Nayanthara Advertisement Remuneration: 50 సెకన్ల యాడ్‌కి రూ.5 కోట్లా?

Nayanthara Advertisement Remuneration: కమర్షియల్‌ యాడ్స్‌ అంటే నయ్.. నయ్ అనే నయన్‌.. ఇప్పుడు సై సై అంటుంది. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి ఇప్పటి వరకు లేడీ సూపర్‌ స్టార్‌ యాక్ట్‌ చేసిన కమర్షియల్‌ యాడ్స్‌ చేతి వేళ్లపై లెక్కపెట్ట వచ్చు.

ఎందుకంటే.. చాలా రేర్‌. అసలు సినిమాల్లో తప్ప పెద్దగా ఎక్కడా బయట కనిపించదు నయనతార. ఈవెన్‌ ఆమె యాక్ట్‌ చేసిన సినిమాలకు ప్రమోషన్లు, ప్రీ ఈవెంట్‌ ఫంక్షన్లు, సక్సెస్‌ మీట్‌లు ఇలా.. దేంట్లోనూ కనిపించేది కాదు.

Nayanthara Latest News

కానీ క్రమంగా రూటు మార్చిన నయన్‌.. ఈ మధ్య కాలంలో ప్రమోషన్లలో కనిపించటం మెుదలు పెట్టింది. అయితే తాజాగా నయన తార ఓ కమర్షియల్‌ యాడ్‌(Nayanthara Advertisement)లో యాక్ట్‌ చేసింది. ఆ యాడ్‌కి ఆమె తీసుకున్న రెమ్యూనిరేషన్‌కి.. ఇండస్ట్రీ మెుత్తం షాక్‌ అవుతోంది.

Read Also: కోలీవుడ్‌ రెమ్యుానరేషన్‌లో హీరో సూర్య‌ టాప్

ఆ కమర్షియల్‌ యాడ్‌ కేవలం 50 సెకన్లు మాత్రమే ఉంటుంది. కానీ దానికి ఈ అమ్మడు తీసుకున్న పారితోషకం(Nayanthara Remuneration) అక్షరాలా 5 కోట్ల రూపాయలు. టాటా స్కై, మామిడి రసం ప్రకటనలలో నటించడానికి నయన్ రూ.5 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఇవి కేవలం 50 సెకన్ల నిడివి ఉన్న ప్రకటనలే.. కనీసం నిమిషం కూడా లేని యాడ్స్‌కి ఏకంగా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్(Nayanthara Advertisement Remuneration) తీసుకోవటం ఏంటి భయ్యా అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

Read Also: సోషల్ మీడియా కామెంట్స్ పట్టించుకోను: సురేఖా వాణి

సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార రీసెంట్‌గా అన్నపూరణి చిత్రంతో దిగ్విజయంగా 75 చిత్రాలను పూర్తి చేసుకుంది. యోగి, చంద్రముఖి, బిల్లా, క‌ర్త‌వ్యం, శ్రీరామరాజ్యం, మాయ, అరం వంటి  విభిన్నమైన కథా చిత్రాలు నయనతారను లేడీ సూపర్‌స్టార్‌ను చేశాయి.

ఇకపోతే వ్యక్తిగతంగా ఎన్నో అవరోధాలను అధిగమించిన నయనతార.. లేడీ సూపర్ స్టార్‌గా స్టార్‌డమ్‌ని అనుభవిస్తున్నారు. కెరీర్‌ ప్రారంభంలో హీరో శింబుతో రొమాన్స్‌, లిప్‌లాక్‌ దృశ్యాలతో వార్తల్లోకి ఎక్కారు నయనతార.

ఆ తరువాత యాక్టర్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవాతో సహజీవనం, మతం మార్పు వంటి సంఘటనలతో న్యూస్ ఛానళ్లలో నయనతార కనిపించారు.  అనంతరం డైరెక్టర్‌ విగ్నేశ్‌ శివన్‌తో పరిచయం ప్రేమగా మారడం.. వారి ఆరేళ్ల ప్రేమ పెళ్లికి(Nayanthara Family) దారి తీయడం అన్నీ జరిగిపోయాయి.

Nayanthara with his kids
తన పిల్లలను ముద్దు చేస్తున్న నయనతార

Read Also: టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ ఎమోషనల్ ట్వీట్

పెళ్లైన నాలుగు నెలల్లోనే సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కావడం వంటి సంఘటనలు అన్నీ నయనతార కేరీర్‌లో సంచలన విషయాలే. ఇప్పటికీ అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈమె ఇటీవల జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోకి సక్సెస్‌పుల్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తూ.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకువెళ్లిపోతున్నారు నయనతార. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఆమె ఫుల్‌ బిజీగా ఉన్నారు.

Nayantara advertisement Remuneration
భర్త విఘ్నేశ్ శివన్‌తో  లేడీ సూపర్ స్టార్

ఇటీవలే భర్త నుంచి నయనతార విడిపోబోతున్నారంటూ వార్తలు వైరల్‌ అయిన నేపథ్యంలో.. భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న ఫోటోని ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేసి.. ఆ వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది నయన్.

READ LATEST TELUGU NEWS: నా పదో తరగతి రిజల్ట్స్ చూసి అంతా షాక్: నాని

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS