Thursday, April 24, 2025
HomeHaleem Chicken 65 Bun: రంజాన్ స్పెషల్ ఫుడ్.. టేస్ట్ అద్దిరిపోయిందిగా

Haleem Chicken 65 Bun: రంజాన్ స్పెషల్ ఫుడ్.. టేస్ట్ అద్దిరిపోయిందిగా

రంజాన్ రోజా షురూ అయిపోయింది. ముస్లిం సోద‌రుల‌తో పాటు అన్ని మ‌తాల వారు క‌లిసి క‌ట్టుగా స్ట్రీట్ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. సాధార‌ణంగా రంజాన్ అంటే అంద‌రికీ చికెన్ బిర్యానీ, హ‌లీం మాత్ర‌మే గుర్తుకువ‌స్తాయి. కానీ ఈ రంజాన్ స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు కొత్త వంట‌కం వ‌చ్చేసింది. ఇంత‌కీ ఈ వంట‌కం పేరేంటో తెలుసా.. హ‌లీం చికెన్ 65 బ‌న్(Haleem Chicken 65 Bun). ఇప్పుడు ఈ చికెన్ బ‌న్ హైద‌రాబాద్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

హైద‌రాబాద్ స్టైల్‌లో వండిన మ‌ట‌న్ హ‌లీం, చికెన్ 65ని క‌లిపి బ‌న్‌లో స్ట‌ఫ్ చేస్తారు. దీని(Haleem Chicken 65 Bun) టేస్ట్ మాత్రం వేరే లెవ‌ల్ ఉంటుంద‌ని రుచి చూసిన వారు చెప్తున్నారు. దీనిని హైద‌రాబాద్‌కు చెందిన బేక్‌లోర్ అనే బేక‌రీ ప్ర‌వేశ‌పెట్టింది.

ఈ రెస్టారెంట్ య‌జ‌మాని మ‌హ్మ‌ద్ యూస‌ఫ్ ఈ వెరైటీ డిష్ గురించి మాట్లాడుతూ.. ఈసారి రంజాన్‌కు ఏదైనా కొత్త డిష్‌ను ప‌రిచ‌యం చేయాల‌నుకున్నామ‌ని దాని టేస్ట్ ఇంత మందికి న‌చ్చుతుంద‌ని అస్స‌లు అనుకోలేద‌ని తెలిపారు. రోజూ ఎంత కాద‌న్నా ఒక 2000 బ‌న్స్ ఈజీగా అమ్ముడుపోతున్నాయ‌ని దాంతో స్టాక్ పెంచేందుకు చూస్తున్నామ‌ని పేర్కొన్నారు.

READ LATEST TELUGU NEWS: తెలంగాణ యువతలో 30 ఏళ్లకే బీపీ, షుగర్‌

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS