Rajireddy Daughter in law Pavani: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై టీఎస్ ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి కోడలు పావని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేల గురించి అదే రీతిలో మాట్లాడారు.
“ సీఎం రేవంత్ రెడ్డి భార్యభర్తలను కాపురం చేసుకోవద్దని చెబుతారా.?. మేం కాపురం చేసుకుంటే ఎమ్మెల్యేలు ఆపుతారా.? పెళ్లైన మూడో రోజు నుంచి నా పక్కలోకి నా భర్త రావడం లేదు.
దీనిపై ప్రశ్నిస్తే నాకు ఆ నాయకుడు తెలుసు. ఈ ఎమ్మెల్యే తెలుసు అంటూ బెదిరిస్తున్నారు. పోలీసులు వస్తే వారిని రాజకీయ నేతలతో భయపెట్టిస్తున్నారు.” అంటూ రాజిరెడ్డి కోడలు పావని కంటతడి పెట్టుకున్నారు.
Read Also: రైతుబంధుపై డిప్యూటీ సీఎం భట్టి కీలక కామెంట్స్
రాజకీయ పలుకుబడితో బెదిరిస్తూ…
ఎల్బీనగర్‌లోని తన అత్తగారి ఇంటి ముందు ఆమె శనివారం ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
ముందు ఇంటి ముందు బైటాయించి నిరసన తెలిపింది. వివాహ సమయంలో తాము ఇచ్చిన 30 తులాల బంగారం ఇవ్వాలని కోరింది. పెళ్లికి రూ.30 లక్షల అప్పు చేశామని తెలిపింది.
ఆ అప్పు తీర్చడానికి తనకు తండ్రి లేడని కంటతడి పెట్టుకుంది. అప్పులు ఇచ్చిన వారు ఇంటి మీదకు వస్తున్నారని ఆవేదన చెందింది. ఆ బంగారం ఇస్తే కొంతైనా అప్పు తీర్చుకుంటా అని బోరుమని విలపించింది.
తనకు ఇవ్వాల్సిన బంగారం ఇవ్వకుండా రాజకీయ పలుకుబడితో తన మామ రాజిరెడ్డి బెదిరిస్తున్నారని పావని ఆరోపించారు.
ఎంత పలుకుబడి ఉంటే మాత్రం.. ఆడపిల్ల అయిన తనను ఇబ్బందులకు గురి చేయడం తగదని పేర్కొన్నారు.
తనకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అన్ని విధాల, అన్ని కోణాల్లో పోరాడుతానని చెప్పారు.
Read Also: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే వివేకా ఆగ్రహం
విషయం దాచి మోసం చేసింది?
ఇదిలా ఉంటే.. రాజిరెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డితో 2023 మే 21న వైభవంగా వివాహం జరిగిందని బాధితురాలు పావని తెలిపింది.
అయితే ఆ వివాహానికి ముందు పావని(Rajireddy Daughter in law Pavani)కి సోరియాసిన్ సమస్య ఉందని ఆమె మామ, టీఎస్ ఆర్టీసీ(TSRTC) యూనియన్ లీడర్ రాజిరెడ్డి ఆరోపించారు.
ఆ విషయం దాచి పెట్టి పెళ్లి చేసుకుని తమను మోసం చేసిందని అయన చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే న్యాయస్థానంలో కేసు నడుస్తుందని తెలిపారు.
కోర్టులో కేసు ఉన్న సమయంలో మహిళా సంఘం వారితో పావని వచ్చి గొడవకు దిగడం సమంజసమేనా అంటూ అయన ప్రశ్నించారు.
విషయం ఏదైన ఉంటే కోర్టులో తేల్చుకోవాలని రాజిరెడ్డి వివరించారు. అన్నీ కోర్టులోనే తేల్చుకుంటామని తేల్చి చెప్పారు. ఇలా ఇంటి ముందు ఆందోళన చెపుట్టి తమ పరువు తీయవద్దని రాజిరెడ్డి(RTC union Leader Rajireddy) సూచించారు.
READ LATEST TELUGU NEWS : నా భర్త నిజమైన దేశభక్తుడు: కేజ్రీవాల్ సతీమణి సునీత