Sathyabhama Movie :“సత్యభామ” కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన కాప్ డ్రామా. ఈ చిత్రంలో కాజల్ ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుంది. కాజల్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా మంచి ట్రీట్. కాజల్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటాయి. ఆమె ఇన్ట్రో సీన్ మరియు క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ఆమె నటన సాలిడ్‌గా ఉంది. యంగ్ నటీనటులు అంకిత్, అనిరుద్, నేహా పఠాన్ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. సీనియర్ నటులు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు తమ పాత్రలను బాగా చేశారు. కథనం, సెకండాఫ్ నిరుత్సాహం కలిగిస్తుంది.
కొత్త పాత్రలు పరిచయం అవడం కథనం కన్ఫ్యూజ్‌గా మారుతుంది. ఫస్టాఫ్ లో సాంగ్స్ ఆకట్టుకోలేదు. కొన్ని రొటీన్ టెంప్లెట్‌లను ఉపయోగించడం సినిమా కొత్తదనాన్ని తగ్గించింది. కాజల్ పాత్రను ఇంకా బాగా ఎలివేట్ చేస్తూ మరిన్ని మాస్ సీక్వెన్స్‌లు ఉంటే బాగుండేది. మొత్తంగా, “సత్యభామ” కాజల్ వన్ విమెన్ షో అని చెప్పాలి. కథా కథనాలు బలహీనంగా ఉన్నా, కాజల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాజల్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఓకే అనిపిస్తుంది, కానీ ఇతర ప్రేక్షకులు తక్కువ అంచనాలతో చూడాలి.