March GST Revenue: కేంద్ర ప్రభుత్వానికి మరోసారి రికార్డు స్థాయి జీఎస్టీ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చి నెలకు జీఎస్‌టీ వసూళ్లు 1.78 లక్షల కోట్లు రూపాయలుగా నమోదయ్యాయి.
2017, జూలైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో అత్యధికం కావడం విశేషం. గతేడాది మార్చితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 11.5 శాతం అధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశీయ లావాదేవీలు 17.6 శాతం పెరగడం వల్లే మొత్తం జీఎస్టీ ఆదాయం(GST Revenue) భారీగా పెరిగిందని తెలిపింది. CGST 34 వేల 532 కోట్లు కాగా, SGST 43,746 కోట్లు, IGST 87 వేల 947 కోట్లు సెస్ రూపంలో 12,259 కోట్ల రూపాయలు వచ్చాయి.
Read Also: 4 నెలల మనుమడికి రూ.240 కోట్ల విలువైన షేర్స్ గిఫ్ట్
2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ ఆదాయం(GST Collection) 20.14 లక్షల కోట్లు వచ్చినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
అంతకుముందు సంవత్సరం కంటే 11.7 శాతం ఇది అధికంగా స్పష్టం చేసింది. తెలంగాణలో గతేడాది మార్చి నెలలో వచ్చిన జీఎస్టీ 4 వేల 804 కోట్లు నమోదు కాగా.. ఈ ఏడాది మార్చి(March GST Revenue)లో 5 వేల 399 కోట్ల జీఎస్టీ ఆదాయం నమోదైనట్లు స్పష్టం చేసింది.
గతేడాదితో పోలిస్తే ఈసారి జీఎస్టీ ఆదాయం 12 శాతం పెరిగింది.
READ LATEST TELUGU NEWS: ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్