ఉప్పల్ పరిధి చెంగిచెర్లలో ఆదివారం రాత్రి స్థానిక పిట్టలబస్తీలో దేవుడి పాట విషయంలో ఓ వర్గానికి చెందిన వారు గొడవ చేయగా చివరకు అది ఘర్షణకు దారి తీసింది. ఇందులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు(TS Police) లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, నాయకులు కలిసి ఈరోజు చెంగిచెర్లకు వెళ్లి నిరసన తెలపగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.పోలీసులు(TS Police) ఇరు వర్గాలను చెదరగొడుతూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
READ LATEST TELUGU NEWS: సగం క్యాడర్ మీటింగ్‌కే రాలేదు: మల్లారెడ్డి