Warangal MP Candidate: భారత రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తనపై బీఆర్ఎస్ నేతలు అసభ్యకర ఆరోపణలు చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
హనుమకొండలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి, కడియం శ్రీహరి పాల్గొన్నారు.
పార్టీని చాలామంది వీడినప్పటికీ తననే టార్గెట్ చేశారన్న ఆయన, పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి చీడపురుగుల వల్లే బీఆర్‌ఎస్‌కు ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
Read Also: నాపై ఎందుకంత కక్ష: పవన్ కల్యాణ్
తనను రాజీనామా చేయాలనే హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదని, గత ప్రభుత్వమే ఈ సంస్కృతి తీసుకొచ్చిందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
తాను అవకాశవాదిని కాదని, పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ ఆహ్వానం మేరకే పార్టీలో చేరామని తెలిపారు.
తన కుమార్తె కడియం కావ్య(Warangal MP Candidate)కు పోటీచేసే అవకాశమిచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కడియం శ్రీహరి చెప్పారు.
READ LATEST TELUGU NEWS: రాష్ట్రంలో రాజుకుంటున్న పొలిటికల్ హీట్