తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్(Hanuman Collections) సినిమా భారీగా వసూళ్లను రాబట్టింది. కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. హనుమన్ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం నైజాంలో రూ.7.5 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు, ఆంధ్రలో రూ.10 కోట్ల మేర వ్యాపారం జరిగింది.
కర్ణాటక హక్కులు రెండు కోట్లు ఓవర్సీస్ బిజినెస్ నాలుగు కోట్ల మీద జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది.
ఉత్తర భారతదేశంలో హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం కొనసాగింది. అన్నివర్గాల నుంచి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. అక్కడ ఈ సినిమా రూ.65 కోట్ల రూపాయలని వసూలు చేసింది. తెలుగులో ఒక చిన్న సినిమాకి ఉత్తరాదిలో ఇంత భారీగా కలెక్షన్లు రాబట్టడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
హనుమాన్ సినిమా కలెక్షన్ల(Hanuman Collections) జైత్ర యాత్ర ఓవర్సీస్‌లోనూ కొనసాగించింది. ఈ సినిమా వసూళ్ళని అద్భుతంగా రాబట్టింది. సుమారు 7 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.60 కోట్ల మీద కలెక్షన్స్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటకలో కూడా ఈ సినిమాకి ఆదరణ బాగుంది. బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.22 కోట్లకు పైగా వసూళ్లని నమోదు చేసింది. ఇంకా హనుమాన్ మూవీ ఆంధ్రా- నైజాం ఏరియాల్లో రికార్టు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది.
READ LATEST TELUGU NEWS: సినిమా కోసం 31 కిలోల బరువు తగ్గిన టాప్ హీరో