మాజీ గవర్నర్ తమిళిసై, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను మందలించారంటూ వైరల్ అవుతున్న వీడియోను ఖండించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా అమిత్ షా హావభావాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన భవిష్యత్ కార్యాచరణపై సూచనలు మాత్రమే చేశారని ఆమె తెలిపారు. “2024 ఎన్నికల తరువాత నేను తొలిసారిగా అమిత్ షాను కలిశాను. ఆయన నన్ను పిలిచి, ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడిగారు. సమయాభావం కారణంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని మాత్రమే సూచించారు. ఈ వివరణతో ఊహాగానాలకు ముగింపు పలికాలనుకుంటున్నాను,” అని తమిళిసై ఎక్స్ లో పోస్టు పెట్టారు. తమిళనాడు డీఎమ్‌కే దీనిపై మండిపడుతూ, మహిళా నాయకురాలి పట్ల అమిత్ షా బహిరంగంగా అలా ప్రవర్తించడం సరికాదని వ్యాఖ్యానించింది.