BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్
ఆలేరు, డిసెంబర్ 3.
( వర్డ్ ఆఫ్ ఇండియా)
ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత పై 49204 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వివిధ మండలాల నుండి లభించిన మెజారిటీ 48 వేల 900 ఓట్లు రావడం నా విజయం కాదని ఇది ముమ్మాటికి ఆలేరు ప్రజల విజయమని అన్నారు.
ఆలేరు ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ నాపై ఏ నమ్మకంతో ఇన్ని వేల మెజారిటీ ఓట్లతో గెలిపించారో ఆ నమ్మకాన్ని తప్పక నెరవేర్చుతానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తన గొప్ప విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.