Tuesday, April 22, 2025
Homenewsఎన్టీఆర్ ట్వీట్ పై చంద్రబాబు స్పందన

ఎన్టీఆర్ ట్వీట్ పై చంద్రబాబు స్పందన

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తన మావయ్య, టీడీపీ అధినేత చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “ప్రియమైన చంద్రబాబు మామయ్యకి.. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్ కు నా శుభాకాంక్షలు” అంటూ తారక్ ట్వీట్ చేశారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. “థాంక్యూ వెరీ మచ్ అమ్మ” అంటూ జూనియర్ ఎన్టీఆర్ కు బదులిచ్చారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్, మహేష్ బాబు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులకు సైతం ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS