కొంపల్లికి చెందిన కేతావత్ సంతోష్ అనే వ్యక్తి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని 50 మంది నిరుద్యోగుల నుండి రూ. 2 కోట్ల వరకు మోసం చేసాడు. మోసం ఎలా జరిగింది? కేతావత్ సంతోష్, హాల్ టికెట్లు, ప్రవేశ పరీక్ష, అపాయింట్‌మెంట్ లెటర్స్ అన్నింటినీ ఫేక్‌గా తయారుచేసి నిరుద్యోగులకు ఇచ్చాడు. నిరుద్యోగులు కాల్ లెటర్స్ తీసుకొని ఎయిర్ ఫోర్స్‌కి వెళ్ళగా అన్ని ఫేక్ అని తెలియడంతో మోసపోయామని గ్రహించారు. నిందితుడు మాయమాటలు చెప్పి బాధితుల నుండి డబ్బు తీసుకొని పరారయ్యాడు. ఈ మోసపరమైన బాధితులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.