ఢిల్లీ : ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి నివేదిక సమర్పించింది. 191 రోజుల పాటు పని చేసి మొత్తం 18,626 పేజీల నివేదిక రాష్ట్రపతికి అందించింది. తొలి దశలో లోక్ సభ అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సూచించింది. తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. హంగ్ హౌజ్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది.