ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో తన వర్క్‌ను కాపీ కొట్టారంటూ సౌత్ కొరియాకు చెందిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సుంగ్ చోయ్ ఆరోపణలు చేశారు. పదేళ్ల క్రితం తాను డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్‌ను కల్కి సినిమాలో సేమ్ టు సేమ్ కాపీ కొట్టారని అన్నారు. ఆ వర్క్‌ను అప్పుడే యూట్యూబ్‌లో రిలీజ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇతరుల ఆర్ట్‌ను కాపీ కొట్టడం పెద్ద తప్పని, ఈ సమాజంలో ఆర్ట్ వర్క్ చేయడం మంచిదా కాదా అని తాను ప్రశ్నించుకుంటూ ఉంటానని మండిపడ్డారు. మార్వెల్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ సినిమాలకు సుంగ్ చోయ్ కాన్సెప్ట్ డిజైనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తన అనుమతి లేకుండా కల్కి టీం తన వర్క్ వాడేసుకుని, తామే సొంతంగా క్రియేట్ చేసినట్లు టీజర్ రిలీజ్ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

