ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు సూర్య. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు సూర్య. కంగువ కోసం కెరీర్‌లోనే అత్యధికంగా 30 కోట్ల రెమ్యునరేషన్ స్వీకరించినట్లు సమాచారం. సినిమాలతో పాటు యాడ్స్ ద్వారా బాగానే ఆర్జిస్తున్నాడు. అంతే కాకుండా సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ఉంది….. అలాగే ఇండియన్ స్ట్రీట్ లీగ్‌తో పాటు మరికొన్ని స్పోర్ట్స్ లీగ్‌లలో సూర్యకు సొంతంగా టీమ్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఏటా వందల కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు సూర్య. ప్రస్తుతం సూర్య, జ్యోతిక ఇద్దరి ఆస్తుల విలువ కలిపి 537 కోట్లు అని సమాచారం. ఇందులో సూర్య వాటా 206 కోట్లు కాగా…జ్యోతిక ఆస్తుల విలువ 331 కోట్లు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం…..
సూర్య కంటే జ్యోతిక ఆస్తుల విలువ ఎక్కువ అని చెబుతోన్నారు. సూర్య కంటే 125 కోట్ల వరకు ఎక్కువగా ఆస్తులను జ్యోతిక కలిగి ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే సూర్య, జ్యోతిక కలిసి ముంబైలో ఖరీదైన బిల్డింగ్‌ను కొనుగోలు చేశారు. ఈ బిల్డింగ్ వాల్యూ దాదాపు 70 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైలో ఇరవై వేల స్వ్కేర్ ఫీట్స్‌లో విశాలమైన సొంత బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ధర వంద కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు…..
సూర్య దగ్గర ఉన్న ఖరీదైన కార్లు ఇవే……. సూర్య దగ్గర పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వాటిలో బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌కు చెందిన కారునే సూర్య ఎక్కువగా ఉపయోగిస్తాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ ఎస్‌యూవీ కారు ఖరీదు కోటి ముప్పై ఏడు లక్షల వరకు ఉంటుందని తెలిసింది. ఎనభై లక్షల విలువైన ఆడీ క్యూ 7 కారు సూర్య వద్ద ఉందట. వీటితో పాటు మెర్సిబెజ్ బెంజ్ (60 లక్షల ధర), జాగ్వర్ (కోటి పది లక్షలు ఖరీదు) కార్లు కూడా సూర్యకు ఉన్నాయని సమాచారం.
కంగువ బడ్జెట్……. కంగువ మూవీ దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సూర్య కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా కంగువ నిలిచింది. ఫాంటసీ యాక్షన్ మూవీని 38 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు శిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైతాన్ మూవీతో దాదాపు 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ఈ మూవీలో మాధవన్ విలన్‌గా నటించాడు.