పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం చినమార్కెట్‌లో ఆదివారం పది కేజీల పండుగప్ప అమ్మకానికి వచ్చింది. ఈ పెద్ద సైజ్ పండుగప్ప స్థానిక వశిష్ట గోదావరిలో మత్స్యకారులకు చిక్కింది. నరసాపురం పట్టణానికి చెందిన కొందరు ఈ పండుగప్పను రూ.5600కి కొనుగోలు చేశారు. గోదావరిలో ఇంత పెద్ద పండుగప్ప దొరకడం చాలా అరుదని మత్స్యకారులు, వ్యాపారులు తెలిపారు.